జనంసాక్షి , మంథని : మంథని సింగిల్ విండో తో సహా ఇతర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరిగిన సుతిలి కొనుగోలు కుంభకోణం పై విచారణ జరిపించాలని, ప్రభుత్వమే సుతిలి సరఫరా చేయాలని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇనుముల సతీష్ జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణకు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని సింగిల్ విండో తో సహా ఇతర ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత మూడు ఏండ్లుగా సుతిలి కొనుగోలు పేరిట జరుగుతున్న కోట్లాది రూపాయల కుంభకోణం పై విచారణ జరిపించాలని, ప్రస్తుత సీజన్ నుండి జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ని సివిల్ సప్లై శాఖ చేస్తున్న గన్నీ సంచుల తరహాలోనే సుతిలి కూడా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రాన్ని అందజేశారు.




