Wednesday, 4 November 2026

నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆసరా పెన్షన్ల పంపిణీ

 

దంతాలపల్లి ఆగస్టు 29 జనంసాక్షి

ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఆసరా పెన్షన్లు మంగళవారం డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ధర్మారపు వేణు తెలిపారు. మండల కేంద్రంలో ఉదయం 10 గంటలకు, మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.