ముంబయి: బాలీవుడు నటులు సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ వివాహం మంగళవారం జరగనుంది. ముంబయిలోని ఓ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరు వివాహం చేసుకోబోతున్నారు. అనంతరం సాయంత్రం మిత్రులకు, బంధువులకు విందు ఇవ్వనున్నారు. నిన్న రాత్రి బాంద్రాలోని తన ఇంట్లో కరీనాకపూర్ విందు ఏర్పాటు చేశారు. దీనికి 50 నుంచి 60 మంది హాజరైనట్లు సమాచారం. పెళ్లి అనంతరం ఈ నెల 18 న ఢిల్లీలో భారీ విందును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.




