నేడు కొల్లూర్ లో కార్తీక మాసం వన బోజన కార్యక్రమం
ఝరాసంగం నవంబర్ 20( జనం సాక్షి ) మండలంలోని కొల్లూరు గ్రామ శివారులో వెలసిన శ్రీ రామలింగేశ్వర ఆలయం లో ప్రతి సంవత్సరం నిర్వహించే మాదిరిగానే ఈ సంవత్సరం సోమవారం కొల్లూరు గ్రామ శివారులో నీ రామలింగేశ్వర ఆలయం లో పచ్చని ప్రకృతిలో అందమైన అటవీ ప్రాంతంలో వెలసిన రామలింగేశ్వర ఆలయం వద్ద వన బోజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు సూదమ పటేల్ అన్నారు. కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా సూదమ పటేల్ మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ కలిసి ఈ సంవత్సరం కూడా వనభోజనం కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. పరిసర గ్రామాల్లో , అందరికీ తెలియ పరచి హాజరు అయ్యి ఇట్టి కార్యక్రమం విజయ వంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ సభ్యులు గా, సిద్దన్న పాటిల్, పొట్ పల్లి, మాజీ సోసైటి చైర్మెన్ సంగారెడ్డి, మల్ శెట్టి, నర్సింలు పాటిల్ వనం పల్లి మాజీ సర్పంచ్, జి నర్సింలు కుప్పా నగర్, మోహన్ రెడ్డి సర్పంచ్ కాక్కర వాడ, శ్రీకాంత్ రెడ్డి, బస్వరాజ్,లను ఎన్నుకున్నారు కార్యక్రమంలో సోమవారం ఉదయం 10 గం.లకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వన బోజన కార్యక్రమం ఉంటుంది అని సభ్యులు పేర్కొన్నారు, ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథిలు గా శ్రీ శ్రీ వీరచ శివా చారి మహారాజ్, దనసిరి గారూ, శ్రీ శ్రీ అవధూత వైరాగ్య శిఖామణి బర్ధిపూర్,. ఆశ్రమం, శ్రీ శ్రీ రాచయ్య స్వామి రంజోల్ ,రాజయోగ ఆశ్రమము, శ్రీ శ్రీ దేవగిరి మహారాజ్, ఆదిలక్ష్మి ఆశ్రమం. మూంగి హాజరు కానున్నారు అన్నారు ,ఆధ్యాత్మికత కార్తీక మాస విశిష్టత ను వివరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని , అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు.
నేడు కొల్లూర్ లో కార్తీక మాసం వన బోజన కార్యక్రమం




