నేడు చేర్యాలకు మంత్రి హరీష్ రావు రాక..

చేర్యాల (జనంసాక్షి) జూన్ 06 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాల, కొమురవేల్లి మండలం మర్రిముచ్చాల గ్రామాలలో నేడు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు.