Saturday, 7 November 2026

నేడు జగిత్యాలలో అయ్యప్ప మండల పూజ

నేడు జగిత్యాలలో అయ్యప్ప మండల పూజ

ఆలయ ఆవరణలో మహిశి సంహారం

జగిత్యాల ,ప్రతినిధి (జనంసాక్షి) డిసెంబర్ 26

జగిత్యాలలో అపర శబరిమలగా వెలిసిన అయ్యప్ప ఆలయంలో నేడు మంగళవారం మండల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ సభ్యులు తెలిపారు. అయ్యప్ప జాతరకు గాను అన్నీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. మంగళవారం ఉదయం గణపతి హోమం, నగర సంకీర్తన, మార్కండేయ దేవాలయం నుండి తిరువాభరనముల ఊరేగింపు, అయ్యప్ప స్వాములచే మూల విరాట్టుకు అభిషేకం, మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాలుంటాయని తెలిపారు. ఉదయం 10 గంటలకు మెట్ల పూజను స్వాములచే ( పడిపూజ ) అంగరంగవైభవంగా, భక్తి శ్రద్ధలతో, భక్తుల భజనలతో అయ్యప్ప స్వాముల శరణ్ ఘోషతో నిర్వహిస్తామని వివరించారు.
అలాగే 18 మంది అయ్యప్ప స్వాములకు గురుదండ బహుకరించడం జరుగుతుందని, మధ్యాహ్నం ఆలయ ఆవరణలో మహిషి సంహారం చేయనున్నట్లు, పడిపూజ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు, స్వాములకు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మండల పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామి కృపకుపాత్రులు కాగలరని కోరారు.