Wednesday, 4 November 2026

నేడు జడ్పీ చైర్మన్ చేతుల మీదుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

 

 

 

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి.,మంథని పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల 19న బుధవారం పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు. సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంఘ పరిధిలోని ఎక్లాస్ పూర్ సెంటర్ ఉదయం 10గంటలకు, ఖానాపూర్ సెంటర్ 10.30గంటలకు, గోపాల్ పూర్ సెంటర్ 11.00గంటలకు, సూరయ్యపల్లి సెంటర్ 11.30 గంటలకు, మద్యాహ్నం 12 గంటలకు కాకర్లపల్లి సెంటర్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కావున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంఘ పాలకవర్గ సభ్యులు, మండల, గ్రామ, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, అధికారులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.