హైదరాబాద్,నవంబర్12(జనంసాక్షి): జలవిహార్‌లో దివ్యాంగుల కృతజ్ఞత సభను మంగళవారం నిర్వహించనున్నట్లు తెలంగాణ వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి తెలిపారు. దివ్యాంగుల కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. కూటమి పేరుతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అమరావతి, ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు చేతిలో కాంగ్రెస్ నేతలు కీలుబొమ్మలుగా మారారు. పొత్తుల పేరుతో ఏర్పడ్డ కూటమి ముఖ్య ఉద్దేశం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఉద్యమకారులను గుర్తించి అన్ని పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్. రాష్ట్రంలో ఐదు లక్షల మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.




