Tuesday, 3 November 2026

నేడు నామినేషన్ దాఖలు చేయనున్న జయలలిత

చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత చెన్నయ్ లోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నేడు తన నామినేషన్ వేయబోతున్నారు. అక్రమాస్తుల కేసులో సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే హోదాను జయలలిత కోల్పోయారు. ఆ తరువాత ప్రత్యేక కోర్టు తీర్పును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో తిరిగి సీఎం పీఠమెక్కిన జయలలిత ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. జయలలిత ఎన్నిక కోసం ఆర్కే నగర్ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేవారు. వెను వెంటనే ఎన్నికల సంఘం ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేదుకు షెడ్యూల్ ప్రకటించింది. జయలలిత బరిలోకి దిగుతున్న ఈ స్థానం నుంచి పోటీకి అటు డీఎంకేతో పాటు పీఎంకే కూడా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో జయలలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *