Tuesday, 3 November 2026

నేడు మండలానికి వ్యవసాయ శాఖ మంత్రి రాక

నేడు మండలానికి వ్యవసాయ శాఖ మంత్రి రాక

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (30): మండల పరిధిలోని బుద్ధారం గ్రామంలో జాగీర్ధర్ రైట్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉదయం 9 గంటలకు బుద్ధారం గ్రామానికి వస్తారని అని జెడ్పీటీసీ మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఎంపీపీ , వైస్ ఎంపీపీ, సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ సభ్యులు, అన్ని గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు, మండల ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు