నేడు ‘ మలాలా డే ‘

ఐక్యరాజ్యసమితి: పాకిస్థాన్‌ సాహస బాలిక మలాలా యూసుఫ్‌జైకి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాస్‌ కీ మూన్‌ మద్దతు  ప్రకటించారు. చదువు కోసం  పోరాడిన మలాలా ప్రపంచంలోని బాలికలందరి విద్యా హక్కుకు ప్రతినిధిగా మారిందని ప్రశంసించారు. ఆమె గౌరవార్థం నవంబర్‌ 10ని ‘ మలాలా డే ‘గా ప్రకటించారు. మరోవైపు మలాలాకు నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటించాలంటూ వినతులు వెల్లువెత్తుతున్నాయి. తాలిబన్ల కాల్పులకు  గురైన మలాలా ప్రస్తుతం బ్రిటిష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. క్రమంగా కోలుకుంటోంది.