Wednesday, 4 November 2026

నేడు విద్యుత్ విజయోత్సవ వేడుకలు – పాల్గొననున్న రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు

 శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ జూన్ 4 (జనంసాక్షి): తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హుజూర్ నగర్ నియోజక వర్గ స్థాయిలో విద్యుత్ విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణంలోని కౌండిన్య ఫంక్షన్ హాల్లో ఈ వేడుకను నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడనున్నారు. కార్యక్రమ అనంతరం భోజన ఏర్పాట్లు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి నియోజక వర్గంలోని హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలోని ప్రజా ప్రతినిధులు , చైర్మన్లు, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని హుజూర్నగర్, మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచెర్ల, పాలకీడు, మెల్లచేరువు, చింతలపాలెం మండలాల ప్రజా ప్రతినిధులు, యంపిపిలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, యంపిటీసీలు, వార్డు మెంబర్లు, అన్ని శాఖల అధికారులు, పంచాయతి కార్యదర్శులు, రైతులు, ప్రజలు, విద్యుత్ వినియోగదారులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.