బెల్లంపల్లి, మే 19,( జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని 132/33 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మత్తుల పనులు ఉండటం వల్ల నేటి ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్ కో డిఈ సత్యనారాయణ తెలిపారు. బెల్లంపల్లి పట్టణంతో పాటు బెల్లంపల్లి రూరల్, తాండూర్, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాల పరిధిలోనీ గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, కావున విద్యుత్ అంతరాయనికి వినియోగదారులు సహకరించాలని కోరారు.




