రాజోలి 19మే (జనం సాక్షి)
పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం మంజూరు అవుతున్న రుణాలను రైతులు సద్వినియోగించుకోవాలని హెరిటేజ్ రీజినల్ హెడ్ సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మాన్దొడ్డి గ్రామంలో హెరిటేజ్ డెయిరీ ఆధ్వర్యంలో రైతులకు HDFC బ్యాంకు ద్వారా రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పశువులకు సెమన్ మరియు సబ్సిడీ పై ఇన్సూరెన్స్, దాన, మిని డైరీ ఫార్మ్ ఏర్పాటు చేసుకునేందుకు తక్కువ వడ్డీ పై రుణాలు, వెటర్నరీ సర్వీస్ సేవలను హెరిటేజ్ డెయిరీ అందిస్తుందని దీనిని పాడి రైతులు సద్వినియోగం చేసుకుని వారి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలన్నారు. అలాగే డైరీ కి పాలు పోసే రైతులకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా ఎటువంటి షూరిటీ లేకుండా 50 వేల నుండి 10లక్షల వరకు రుణాలను అందిస్తున్నట్లు దీనిని రైతులు సద్వినియోగించుకోవాలని HDFC క్లస్టర్ హెడ్ విజయభాస్కర్ తెలిపారు. అనంతరం మంజూరైన 20.4లక్షల రుణాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ డైరీ మేనేజర్ సిరిసాల రాజు, సూపర్వైజర్ గజెందర్ రెడ్డి, Hdfc RM రఘునాథ రెడ్డి, శ్రీరామ్, జగదీష్, రైతులు మాదన్న, రఫీ, సుధాకర్, రాఘవేంద్ర గౌడ్, మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రుణాలను సద్వినియోగం చేసుకోండి




