Wednesday, 4 November 2026

నేను ఎలాంటి పొరపాట్లు చేయలేదు

కడిగిన ముత్యంలా బైటకు వస్తా
ఆరోగ్య తెలంగాణ కోసం పనిచేశా : రాజయ్య

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా  నియోజకవర్గంలో ఏ నాయకుడైనా అడుగుపెడితే ఊరుకోనన్నారు. ఏదైనా నియోజకవర్గ ఇంచార్జీ, ఎమ్మెల్యేకు తెలిసే… జరగాలని హెచ్చరించారు. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో  రాజయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాజయ్య…అవినీతి ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తానన్నారు. మరోవైపు ఆయన  ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ కోసం పాటుపడతానని చెప్పటం విశేషం. కాగా తనను పదవి నుంచి తప్పించటంపై నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *