Wednesday, 4 November 2026

నేను శక్తిమంతమైన సీఎం

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకులు లేవని, తానొక శక్తిమంతమైన సీఎం అని  దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పడిపోయే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.  ప్రస్తుతం తాను సీఎంగా తీసుకునే నిర్ణయాలు ఒక్కడిగానే తీసుకుంటానన్నారు. తమ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా ఢిల్లీలో గానీ, గల్లీలో గానీ తీసుకోవడం లేదని ఫడ్నవీస్ తాజాగా వ్యాఖ్యానించారు.

అయితే ఫడ్నవీస్  ప్రసంగంలోని వ్యాఖ్యలు ప్రధానంగా శివసేననే లక్ష్యంగా చేసుకొనే మాట్లాడి ఉండవచ్చని బీజేపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.  ఆదివారం సిటీ మరాఠీ పత్రిక వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *