హైదరాబాద్,మే15(జనం సాక్షి ): హైదరాబాద్‌లో నివసిస్తున్న ఓ నేపాలీ కుటుంబానికి చెందిన యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. హైదర్‌గూడ పయనీర్ చాంబర్స్ భవనంలో నేపాల్‌కు చెందిన మహేందర్ పరియార్ కుటుంబం నివసిస్తోంది. అతడి కుమార్తె మనీషా పరియార్ ఇంటర్ చదువుతోంది. ఈనెల 13న అవిూర్‌పేటలో స్నేహితుల ఇంట్లో పార్టీ ఉందని తల్లి జోనాకు చెప్పి వెళ్లింది. ఆ రోజు రాత్రి 7.30 గంటలకు తాను అవిూర్‌పేట ఆర్‌ఎస్ బ్రదర్స్ షోరూమ్ వద్ద ఉన్నానని, వచ్చి తీసుకెళ్లమని ఇంటికి ఫోన్ చేసింది. వరుసకు మామయ్య అయ్యే ధన్ బహదూర్ అవిూర్‌పేట వెళ్లగా మనీషా కనిపించలేదు. అమె మొబైల్‌కు కాల్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నారాయణగూడ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.
నేపాలీ యువతి అదృశ్యంపై పోలీసుల గాలింపు




