Tuesday, 3 November 2026

నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసిన డొంకేన రాజు గౌడ్

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ జూన్ 24తుర్కపల్లి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి డొంకెన రాజు గౌడ్ శనివారం నోటు పుస్తకాలను పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి పేరును తీసుకురావాలని అన్నారు. నేను కూడా తుర్కపల్లి ఉన్నత పాఠశాలలో చదువుకొని నాకు ఉన్నంత లో విద్యార్థులకు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని, మీరు కూడా భవిష్యత్తులో పేద విద్యార్థులకు సహాయం అందించాలని కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పదవ తరగతి లో తుర్కపల్లి మండల మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి పదివేల రూపాయల బహుమతిని అందజేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్, ఎలుగల భాను, కందుకూరి వేణు, ఆకుల భాను, శివ, సోమల్ల రాము, తదితరులు పాల్గొన్నారు.