:శామీర్ పేట్, జనం సాక్షి : పంచాయతీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించుకుంటే సమ్మెకు వెళ్తామని ఐఎఫ్టియు నాయకులు హెచ్చరించారు. శనివారం జిల్లాలోని గ్రామపంచాయతీల కార్మికులు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే వచ్చే నెల 6 నుంచి నిరవేదిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి మున్సిపాలిటీల్లో విధంగా వేతనాలు చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు ప్రతినెల జీతాలు ఇవ్వడంతో పాటు సబ్బులు, నూనె, దుస్తులు అందజేయాలని కోరారు. కారోబార్, బిల్ కలెక్టర్లను జూనియర్ కార్యదర్శులుగా ప్రమోట్ చేయ్యాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలో, మండల కార్యాలయంలో ఇప్పటికే సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశామని, ఇప్పటికి స్పందించకుంటే సమ్మెకు సై అంటామని హెచ్చరించారు. పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో 50 వేల మంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. వెంటనే పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు శివ బాబు, అనురాధ,
జయచంద్ర,.శ్రీకాంత్, కార్మికులు వెంకటేష్,బాలయ్య,శారద, యాదమ్మ,నర్సింహ జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 
పంచాయతీ కార్మికులను విస్మరిస్తున్న ప్రభుత్వం




