Wednesday, 4 November 2026

నోముల ఫౌండేషన్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

నోముల ఫౌండేషన్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: పిడిగం నాగయ్య
తిరుమలగిరి (సాగర్), జనవరి05 (జనంసాక్షి): ఈనెల 8వ తేదీన నోముల ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివంగత మాజీ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య 67వ జయంతి సందర్భంగా హాలియాలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ను సద్వినియోగం చేసుకోవాలని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య తెలిపాడు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రజల కోసం రాష్ట్రంలోని పేరుగాంచిన వైద్యుల బృందం చే అన్ని రకాల జబ్బులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేస్తున్నారని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఆయన వెంట టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బానావత్ బాబురావు నాయక్, గుండాల రవి, పోతుగంటి తిరుమల్, బూడిద హరికృష్ణ, పగడాల పెద్దిరాజు, జటావత్ రమేష్, షాగం అంజిరెడ్డి, చెవ్వ నాసర్ రెడ్డి, గుండాల కృష్ణ, వనమాలు తదితరులు పాల్గొన్నారు