Wednesday, 4 November 2026

బెల్లంపల్లి రీజియన్10,వ మహాసభలను విజయవంతం చేయండి

బెల్లంపల్లి రీజియన్10,వ మహాసభలను విజయవంతం చేయండి

జనం సాక్షి) రెబ్బన మండలం. గోలేటి సింగరేణి సివిక్ కార్యాలయ ఆవరణలో గేటు మీటింగ్, రాష్ట్ర అధ్యక్షులు డి. బ్రహ్మానందం మాట్లాడుతూ…
సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు. కార్మికుల సమస్యలపై, వారి హక్కుల పరిరక్షణకై సింగరేణిలో గత మూడు దశాబ్దాలుగా రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నది. సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ పోరాటాల ఫలితంగానే మొదటిసారిగా సింగరేణిలో “జీవో “అమల్లోకి వచ్చింది. పీఎఫ్ సౌకర్యం. హాస్పటల్ సౌకర్యం, కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ పరికరాలు, కాంట్రాక్టర్లు మారినప్పుడల్లా ఊడిపోయే ఉద్యోగాలకు భద్రత కల్పించబడింది. జాతీయ బొగ్గు గనుల వేతన సమావేశాల సందర్భంగా,6,వ వేజ్ బోర్డు కాలం నుండి మొన్న జరిగిన 11వ వేతన సమావేశం వరకు సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఫస్ట్ కేటగిరి, పర్మినెంట్, గ్రాడ్యుటి ప్రమాద బీమా, లాంటి అనేక సమస్యలపై దేశవ్యాప్తంగా ఎక్కడ , జే బి సి సి ఐ. సమావేశం జరిగిన అక్కడికి వెళ్లి అనేక నిర్బంధాలను అధిగమించి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల హక్కుల కోసం సౌకర్యాల కోసం పోరాడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బొగ్గు గనుల ప్రైవేటీకరణ, కాంట్రాక్టికరణ కు వ్యతిరేకంగా, కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త గా జరిగిన అనేక జాతీయ స్థాయి పోరాటాల్లో పర్మినెంట్ కార్మికులతో కలిసి భుజం భుజం కలిపి పోరాడింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్లోబరీకరణ, ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, విధానాలకు వ్యతిరేకంగా సింగరేణిలో ప్రైవేటీకరణ,కు వ్యతిరేకంగా, లొంగుబాటు లోపాయికారి ఓటు సీటు రాజకీయాల జాతీయ కార్మిక సంఘాల సంస్కరణ వాద విధానాలకు, వారి బ్యూరోక్రసికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నది.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా సింగరేణిలో కాంట్రాక్టు కార్మిక వర్గం ఉద్యమాలు చేపడుతూ తమ రీజన్ స్థాయి, కార్మిక వర్గాన్ని, నాయకత్వాన్ని, నిర్మాణాన్ని పటిష్టపరచుకొని మరి ఇంత దిగ్వినీ కృతంగా పోరాడటానికి10,వ రీజియన్ మహాసభలు, బెల్లంపల్లి లోని తిలక్ స్టేడియం లో జరుపుతున్నది. ఈరీజియన్ మహాసభలకు, కాంట్రాక్ట్ కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేస్తున్నది.
ఈ మహాసభలకు సానుభూతిపరులు, శ్రేయోభిలాషులు, ఆర్థికంగా, హార్థికంగా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నది.నాయకులు.ఏ పోషం. జీ సినువస్. సునార్ కార్. సికందర్, పోసు బాయ్, పెంటపర్తి.బాపు, రాణి, భీమేష్, స్వామి, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.