మెరుగైన ఒప్పందం…ఈరోజు మందమర్రి కేకే 5 ఇంక్లైన్ గని పై ఏఐటీయూసీ
ఆధ్వర్యంలో గేటు మీటింగ్ జరిగినది. 11వ వెజ్ బోర్డు
కోల్కతాలో ఈనెల 3
తేదీన నాలుగు జాతీయ
సంఘాలతో జరిగినది
దీనిలో మన సింగరేణి నుండి శాశ్వత వేజ్ బోర్డు
సభ్యులుగా వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని
బొగ్గు గని కార్మికుల 11వ
వేతన ఒప్పందం మెరుగైన
ఒప్పందం చేసుకోవడం జరిగినది. ఇది కార్మిక సంఘాల మరియు కార్మికుల ఘనవిజయం.
అనేకసార్లు సమావేశాలు
జరిగినప్పటికీ కోల్ఇండియా యాజమాన్యం అనేకమైన ఆంక్షలు విధించి కాలయాపన చేయడం వలన 18 నెలల ఆలస్యం అయినప్పటికీ సమ్మెలోకి పోతామని యాజమాన్యానికి కార్మిక సంఘాలుగా హెచ్చరికలు జారీ చేయడం వలన ఈ 8
వ సమావేశ చర్చల్లో యాజమాన్యం ఒక మెట్టు దిగివచ్చి మెరుగైన వేతన ఒప్పందానికి ఒప్పుకోవడం జరిగినది గత 10వ వేతన ఒప్పందంలో 20% పెరుగుదలగా ఉంది. ఈసా రి 11వ వేత ఒప్పందంలో
19 శాతం ఒప్పుకోవడం
హర్షించదగ్గ విషయం మొత్తం టోటల్ లో 39%
రావడం వలన 10 వేజ్ బోర్డులో మినిమం గ్యారెంటీ బెనిఫిట్ 4800 పెరిగినది. ఈ 11వ వేజ్ బోర్డులో 7000 వరకు పెరుగుతుంది అని బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ. అన్నారు
క్యాటగిరి వైజ్ గా కార్మికులకు పూర్తి గణాంకాలతో నిషేధికరించి
చెప్పడం జరిగినది. ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో
ఇంతటి మెరుగైన ఒప్పందం జరగలేదు అని అన్నారు. ఒక కేవలం మన బొగ్గు పరిశ్రమల లో కార్మిక సంఘాల కార్మికుల ఐకమత్యంతో మెరుగైన వేజ్ బోర్డును సాధించుకోవడం జరిగిందని అన్నారు. కానీ
కొన్ని పనికిమాలిన క్రాఫ్ట్ సంఘాలు జాతీయ సంఘాలను ప్రధానంగా ఏఐటియుసిని. ఈ ఒప్పందాన్ని విమర్శించడం
వారి అవివేకానికి నిదర్శనం
వీరు వేజ్ బోర్డు సభ్యులు గారు వేజ్ బోర్డు పై అవగాహన లేని కార్మిక సంఘాలు. వీరిని కార్మికులు అసహ్యించుకున్న వీరికి బుద్ధి రావడం లేదు. ఇప్పటికైనా కార్మిక లపట్ల
చిత్తశుద్ధితో కార్మిక హక్కులను కాపాడడంలో
పోరాటాలు కలిసి రావాలని
పిలుపునివ్వడం జరిగినది.
ఈ సంఘం గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనేక వాగ్దానం చేసి. ఏ ఒక్క సమస్యపై యాజమాన్యాన్ని నిలదీసిన దాఖలాలు లేవు
పైపెచ్చు సింగరేణి ఆర్థిక దోపిడీ చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా
మాట్లాడే దమ్ము ధైర్యం లేని
ఈ సంఘం జాతీయ సంఘాలను విమర్శించే నైతిక హక్కు లేదు అని అన్నారు. కోల్ ఇండియాలో
పెరెక్సు పై ఇన్కమ్ టాక్స్
యాజమాన్యమే చెల్లిస్తుంది. ఐదు సంవత్సరాల క్రితమే ఈ అగ్రిమెంట్ చేయడం జరిగినది. కానీ మన దగ్గర
సింగరేణి యాజమాన్యం
పెర్క్సు పై ఇన్కంటాక్స్ చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారు. అధికారులకు చెల్లిస్తూ కార్మికులకు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఏఐటీయూసీ యాజమాన్యాన్ని
గుర్తింపు సంఘాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా
కోల్ ఇండియా మాదిరిగా
పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్
యాజమాన్యమే భరించాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు
ఐకమత్యంతో రానున్న రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ భీమ నాధుని సుదర్శన్. మరియు బ్రాంచ్ సహాయ కార్యదర్శి కంది శ్రీనివాస్ లు పాల్గొని ప్రసంగించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న
నాయకులు కార్యకర్తలు.
పిట్ కార్యదర్శి కొత్త తిరుపతి. సహాయ కార్యదర్శులు గాండ్ల సంపత్. టేకుమట్ల తిరుపతి. వర్క్ షాప్
పిట్ కార్యదర్శి సిహెచ్ పి శర్మ. కేకే ఒకటి గని ఇంఛార్జి ఆంటోనీ దినేష్. ఏరియా నాయకుడు
జెట్టి మల్లయ్య. పిట్టు నాయకులు సట్ల కొండయ్య. గుడిమల్ల సంపత్. కాసం సమ్మయ్య. వెంకటస్వామి. జవాజీ శ్రీనివాస్.
కండె రాజకుమార్. పిట్ కమిటీ సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
..జనం సాక్షి
మెరుగైన ఒప్పందం…ఈరోజు మందమర్రి కేకే 5 ఇంక్లైన్ గని పై ఏఐటీయూసీ




