Thursday, 5 November 2026

న్యాయవాద దంపతులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి

న్యాయవాద దంపతులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి
ఖమ్మం అర్బన్, న్యాయవాద దంపతులపై దాడి చేసిన సిపిఐ పార్టీ నాయకుడు కర్నాటి భాను ప్రసాద్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని లేని పక్షంలో బహుజన జెఏసి కుల ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్రితం చేస్తామని తదుపరి జరిగే చర్యలకు ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ బహుజన జేఏసీ ప్రజా కుల సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం ఈ కార్యక్రమంలోబీసీ జేఏసీ చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు, బీసీ జేఏసీ కన్వీనర్ షేక్ నజీమా, ఎల్ హెచ్ పి ఎస్ అధ్యక్షుడు బానోత్ బద్రి నాయక్, బహుజన జేఏసీ ఖమ్మం జిల్లా చైర్మన్ దేశబోయిన సంపత్ కుమార్, పాలేరు నియోజకవర్గ కన్వీనర్ సర్వ నాగాసంతోష్, ఆర్ పి ఐ పార్టీ అధ్యక్షులు సంజీవరావు, మైనారిటీ సెల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.