Thursday, 5 November 2026

ప్రజలందరు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలి దేవరకొండ కాంగ్రెస్ నాయకులు

ప్రజలందరు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలి దేవరకొండ కాంగ్రెస్ నాయకులు కేతావత్ భీల్యా నాయక్
కొండమల్లేపల్లి జనవరి 14 జనం సాక్షి న్యూస్ :
దేవరకొండ పట్టణం లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్థునటువటి ధనుర్మాస వ్రత మహోత్సవ ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన టిపిసిసి నాయకులు కేతావత్ భీల్యా నాయక్ అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.అనంతరం భీల్యా నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అందరు ఆయురారోగ్యాలతొ ,సుఖ సంతోషాలతో మెలగాలని వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని ఆకాంక్షించారు దేవరకొండ నియోజకవర్గ సమస్త ప్రజానీకానికి ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంక్రాంతి రైతుల బతుకుల్లో ఆనందం నింపాలని యువత లక్ష్యసాధనకు నాంది కావాలని ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గరుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఆలంపల్లి నరసింహ,పానుగంటి మల్లయ్య,దొడ్డి అశోక్, దొడ్డి వెంకటేశ్వర్లు, నల్లగాసు జాన్ యాదవ్, టీవీఎన్ రెడ్డి, నీల బుచ్చయ్య, హరిలాల్ నాయక్, జైపాల్ నాయక్, కిరణ్ నాయక్ మరియు దేవరకొండ పట్టణ ప్రముఖులు వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు