డోర్నకల్ ఫిబ్రవరి-8/ జనం సాక్షి న్యూస్:డోర్నకల్ మండల కేంద్రంలో బుధవారం డోర్నకల్ నియోజకవర్గ బాధ్యులు రామచంద్రనాయక్ నాయక్ ఆదేశాల మెరుకు కాంగ్రెస్ పార్టీనాయకులు,కార్యకర్తలు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డోర్నకల్ నియోజకవర్గంలో నిర్వహించే హాత్ సే హాత్ జోడో పాదయాత్ర పర్యటన విజయవంతం చేయాలని కార్యకర్తలకు మండల అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారుమాట్లాడుతూ రేపు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర లో భాగంగా డోర్నకల్ నియోజకవర్గం పెద్ద నాగారం నుండి మరిపెడ బంగ్లా ఆర్అండ్బి గెస్ట్ హౌస్ వరకు కొనసాగుతున్న సందర్భంలో డోర్నకల్ మండల ప్రజలు నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు అత్యధిక సంఖ్యలోపాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, డోర్నకల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగుర వేస్తామని హర్షం వ్యక్తం చేశారు.




