న్యూయార్క్: భీకర్ తుఫాను శాండీతో అమెరికా అతలాకుతలం అవుతోంది, తుపాను ప్రభావంతో అలల ఉద్థృతి భారీగా పెరిగింది, దీంతో న్యూజేర్సీ తీర ప్రాంతంలోని ఓస్టర్ క్రీక్ అణు విద్యుత్ కేంద్రం వద్ద అధికారులు హైఅలర్ట్ ప్రకటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు శాండీ ప్రభావంతో న్యూయార్క్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 12 కి చేరింది. న్యూయార్క్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎస్‌వైయూ మెడికల్ కేంద్రంలో జనరేటర్లు కూడా పనిచేయకపోవడంతో రోగులను ఇతర ప్రాంతాలకు తరలించారు.




