Tuesday, 3 November 2026

పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న కొండమల్లేపల్లి సిఐ రవీందర్ ఎస్ఐ

పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న కొండమల్లేపల్లి సిఐ రవీందర్ ఎస్ఐ నారాయణరెడ్డి కొండమల్లేపల్లి ఫిబ్రవరి 2 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలోని వినాయక నగర్ లో లక్ష్మీ గణపతి సరస్వతి సమేత వినాయక స్వామి దేవాలయం లో శ్రీ పంచముఖ ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం గురువారం వైభవోపేతంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సాంప్రదాయ బద్ధంగా ఈ క్రతువు నిర్వహించారు. కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకలలో సిఐ రవీందర్ మరియు ఎస్ఐ నారాయణరెడ్డి లు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు తొలుత ఆలయ అధికారులు వారికి సంప్రదాయ‌బద్దంగా స్వాగ‌తం ప‌లికారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ.. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. అటువంటి మహిమాన్వితమైన స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం కొబ్బరికాయలు కొట్టి నివేదన చేసుకునేందుకు శ్రీ పంచముఖ ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం శుభపరిణామమన్నారు. ఆ ప్రసన్నాంజనేయ స్వామి చల్లని చూపు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రతీ ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, మండల సర్పంచుల పోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, కొత్త బావి సర్పంచ్ జబ్బు యాదయ్య యాదవ్, ఆలయ అర్చకులు డేరం జయప్రకాష్ శర్మ , లింగాల మధుసూదన్ రెడ్డి వరికుప్పల శ్రీనివాస్ పాక లక్ష్మయ్య కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు