హుజూర్ నగర్ జూన్ 24 (జనం సాక్షి) మండలంలోని లింగగిరికి చెందిన ఎల్లంచెట్టి జయరాములు ఆదర్శవంతుడని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగన్న అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన రాములు కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాములు జీవించి ఉన్నంత కాలంలో ఎంతో ఆదర్శవంతంగా బ్రతికాడని, ఆయన బాటలో పెద్ద కుమారుడు వీరస్వామి సిపిఎం పార్టీ మండలy కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడని, చిన్న కుమారుడు మంగులు తోడుగా ఉంటున్నారన్నారు. రాము లాంటివారు పేదల పక్షాన పని చేసే వారికి ఎంతో ఆదర్శ అన్నారు. రాములు కుటుంబానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకట్ రెడ్డి, దుగ్గి బ్రహ్మం, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, సర్పంచ్ కర్నాటి అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ నిజాముద్దీన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీలం శీను, టౌన్ కార్యదర్శివర్గ సభ్యులు రేపాకుల మురళి, చిన్న వీరమల్లు, మండల కమిటీ సభ్యులు పిన్నపురెడ్డి వెంకట్రెడ్డి, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పాశం వెంకటనారాయణ, పురుషోత్తం, యానాల సోమయ్య, అబ్దుల్ నబీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రాములు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగన్న




