Friday, 6 November 2026

పొంచి ఉన్న ప్రమాదం వికారాబాద్ జిల్లా పరిధిలో దారూర్ నుండి వికారాబాద్ వెళ్లే రహదారిలో లోతు వాగు దగ్గర ప్రమాదం పొంచి ఉంది.

 రోడ్డుపై ఉన్న కల్వర్టు కున్గింది పెద్దగుంట ఏర్పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది వాహనాదారులు వెళ్లేందుకు అను నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ప్రతి రోజు వందలాది మంది ప్రయాణించే రోడ్డుపై అధికారులు కనీసం ప్రమాద సూచిక బోర్డు కూడా పెట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి,ప్రమాదం బారిన పడ్డట్లే కూలిన కల్వర్టు కింద భాగంలో ప్రమాదకరమైన సుమారు 10 అడుగుల లోతు నీటి గుంట ఉంది వాహనాలు కల్వర్టులో పడితే అంతే సంగతి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి సత్వరమే కల్వర్టు నిర్మాణం చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు ,వాహనదారులు కోరుతున్నారు రాత్రి వేళల్లో ప్రయాణం చేయాలంటే వాహన చోదకులు భయపడుతున్నారు ఈ వర్షాకాలంలో ఈ కల్వర్టు మిగిలిన భాగం కూడా పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు,ఈ రోడ్డుపై ఎక్కువగా అధిక బరువుతో కూడిన సిమెంట్ లారీల వల్ల రహదారి లో కల్వర్టు సగం వరకూ కృంగిపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,