జనం సాక్షి/ కొల్చారంప్రజా సమస్యలు పరిష్కరించమని వెళ్తే ప్రజలపై దురుసుగా వ్యవహరిస్తున్న కొల్చారం మండలం తుక్కాపూర్ పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి వద్దకు వెళ్తే గ్రామస్తులతో మొండిగా మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుండా నాన్చివేత ధోరణి అవలంబిస్తున్న తుక్కాపూర్ పంచాయతీ కార్యదర్శి పై తీసుకోవాలని పంచాయతీ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదగిరి కోరారు గత మూడు నెలలుగా మంచినీటి ట్యాకు శుభ్రపరచడం లేదని గ్రామంలో మురుగు కాలువలు పూడిక తీయడం లేదని వీధి దీపాలు వెలగడం లేదనీ పంచాయతీ కార్యదర్శి కి గురువారం గ్రామస్తులు ఫిర్యాదు చేయడానికి వెళితే గ్రామస్తులతో దురుసుగా పంచాయతీ కార్యదర్శి దురచుగా మాట్లాడిందన్నారు ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి స్వాతి ప్రియ ను వివరణ కోరగా తాను ఎవరిని దూషించలేదని గ్రామ సమస్యలు పరిష్కరించడానికి అంకితభావంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
పంచాయతీ కార్యదర్శి బూతు పురాణం.. సెక్రెటరీ పై చర్యలు శూన్యం




