జనంసాక్షి, మంథని : సంకటహర చతుర్థి పర్వదినమున పురస్కరించుకొని బుధవారం భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు సంకటాలు తొలగించే సంకటహర చతుర్థి దీక్షతో భక్తులు పునీతులు అవుతున్నారు. వైశాఖ మాసంలో వచ్చిన సంకటహర చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులతో శ్రీ విఘ్నేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. ప్రతి నెలలో ఒకసారి వచ్చే సంకటహర చతుర్థి పర్వదినం రోజున శ్రీ మహాగణపతి దేవాలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం రాత్రి చంద్రోదయం అనంతరం చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులు చంద్రోదయం అనంతరం భోజనం చేస్తారు. మంథని పట్టణంలోని తమ్మిచెరువు కట్ట వీధిలో గల శ్రీ మహాగణపతి దేవాలయం ఎంతో విశిష్టత సంతరించుకుంది. జేష్ట మాసం వచ్చిన సంకట చతుర్థి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మహాగణపతిని దర్శించుకున్నారు. సంకటహర చతుర్థి పర్వదినం రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి కి 121 మోదకుడు సమర్పించడం అలాగే దూర్వాలు సమర్పించడం ఎంతో శ్రేయస్కరం అని భక్తుల విశ్వాసం. ప్రతినిత్యం ముఖ్యంగా ప్రతి మంగళవారం ఎందరో భక్తులు ఆలయంలో మహా గణపతిని దర్శించుకొని వెళుతుంటారు. ప్రతి మంగళవారం భక్తులు విగ్నేశ్వరుని పూజిస్తుంటారు. ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజున మంథని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సంకటహర చతుర్థి దీక్ష పట్టిన భక్తులు రాత్రి చంద్రోదయం అనంతరం మాత్రమే ఉపవాస దీక్షను విరమిస్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అనేక రకాల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు.
సంకటాలు తొలగించే సంకటహర చతుర్థి – చతుర్థి పూజలందుకున్న గణపతిభక్తితో దర్శించుకున్న భక్తులు




