Thursday, 5 November 2026

పంచాయతీ కార్యదర్శుల న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలి

 

 

 

 

 

 

బిచ్కుంద మే (జనంసాక్షి)గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెక్రటరీలు లేక ప్రజల అనేక పనులు నిలిచిపోతున్నాయి. కాగా పంచాయతీ సెక్రటరీలతో సర్కారు మూడు ముక్కలాట ఆడుతోంది. ఒకే డిపార్ట్​మెంట్ ​కింద పనిచేస్తున్న ఉద్యోగులను వేర్వేరుగా చూస్తోంది. బిచ్కుంద మండలంలో 27 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 12,750 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తుంటే వీళ్లలో కొందరిని సీనియర్​ కార్యదర్శులు అని, మరికొందరిని జూనియర్​పంచాయతీ కార్యదర్శులని, ఇంకొందరిని అవుట్​సోర్సింగ్​ కార్యదర్శులని మూడు రకాలుగా పిలుస్తున్నారు. దీనివల్ల శాఖాపరంగా పని విభజనలో తేడాలు రావడమేగాక, జీతంలో, ఉద్యోగ భద్రతలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకే గొడుగు కింద పనిచేస్తున్న కార్యదర్శులను వేర్వేరుగా చూడటం వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. పైగా అసోసియేషన్ల వ్యవహారాల్లోనూ సంబంధం ఉండడం లేదు. దీనివల్ల డ్యూటీలో ప్రాణాలు కోల్పోతున్న జూనియర్, అవుట్​సోర్సింగ్ ​కార్యదర్శుల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గత వారం రోజుల పైగా సమ్మే చేస్తున్నా ప్రభుత్వం భరోసా ఇవ్వకపోగా పైనుంచి టెర్మినల్ చేస్తామని హెచ్చరిక చేస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట, పంచాయతీ కార్యదర్శుల న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలని జనం కోరుతున్నారు.