రేగోడ్ //జనం సాక్షి //మే 1:తెలంగాణ రాష్ట్రంలో రెండవ కందిమల్లపల్లిగా వెలుగుతున్న ఏకైక శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం లో రాష్ట్ర సిఐటియు నాయకులు ఎండి సర్దార్, స్థానిక సర్పంచ్ బాదనపల్లి నరసింహులు ఎంపీటీసీ గొల్ల నర్సింలతో కలిసి అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా సందర్భంగా రాష్ట్ర కార్మికులు గ్రామస్తులు ప్రజలందరూ బాగుండాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పూజారి బద్దారం శివకుమార్ వీరికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ యాదవ్,వీరన్న, ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు.




