మొదలైన బిసి ఓట్ల గణన
ఈనెల పదిలోగా పూర్తికి ఆదేశాలు
హైదరాబాద్,మే18(జనం సాక్షి ): నిర్ణీత గడువులోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇటీవల ఆమోదించిన పంచాయితీ చట్టం మేరకు కసరత్తు చేపట్టారు. అన్ఇన వివరాలు తేలాక రిజర్వేషన్లు ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. బహుశా ఆగస్టులో లేదా అంతకు ముందే ఎన్‌ఇనకలు జరగగలవని అంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ గణనను ప్రారంభించనున్నది. జూన్ 10లోగా బీసీ గణన పూర్తిచేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. జూన్ మూడు నుంచి బీసీ, ఎస్టీ, ఎస్సీ ఓటర్ల జాబితా ప్రకారం ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. జూలై చివరివారంలో మూడు విడుతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
పంచాయతీరాజ్ ఎన్నికల పక్రియలో భాగంగా రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 12,751 గ్రామాలు, 1,13,380 వార్డుల్లో మార్పులతో కూడిన ఓటరు తుదిజాబితాను పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు విడుదలచేశారు. కుటుంబాలవారీగా వివరాలు సేకరించి ఓట్లన్నీ ఒకేచోట పొందుపర్చారు. ఈ జాబితా ఆధారంగా బీసీ గణన మొదలుపెట్టనున్నారు. గ్రామం, వార్డుల్లో ప్రతీ ఓటరు ఇంటికి వెళ్లి బీసీ గణన చేయాలని అధికారులు ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్ల జాబితాను కూడా తయారుచేయనున్నారు. బీసీ గణనను వచ్చేనెల 2లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ
మేరకు 15 రోజుల్లో బీసీ గణన నివేదిక సమర్పించనున్నారు. జూన్ మూడునుంచి బీసీ, ఎస్టీ, ఎస్సీ ఓటర్ల జాబితా ప్రకారం ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయనుంది సర్కారు. వారంలో రిజర్వేషన్లను ఖరారుచేయాలని ఇప్పటికే నిర్ణయించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం మరుసటిరోజు నుంచే రిజర్వేషన్ల పక్రియను మొదలుపెట్టి, జూన్ 10 వరకు రిజర్వేషన్ల జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందించనున్నారు. జాబితా అందాక ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల విధానం మారనున్నది. ఇప్పటివరకు కేటాయించిన రిజర్వేషన్లతో సంబంధం లేకుండా కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. కొత్త చట్టం రావడం, నూతన గ్రామాలు ఏర్పాటుకావడంతో ఈ నిబంధన అనివార్యమైంది. రాష్ట్రంలో జూలై చివరివారం నుంచి పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. చిన్నజిల్లాల్లో రెండు విడతలు, పెద్దజిల్లాల్లో మూడు విడతల్లో పోలింగ్ పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ వారంలోనే పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల జాబితా ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నారు.
—————
పంచాయితీ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు




