జనంసాక్షి , మంథని : మంథని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు రెండు రోజులు పంచాయితీ కార్యదర్శిలు చేస్తున్నా సమ్మెకు ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సేగ్గం రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శనివారం సంఘీభావం తెలిపారు. సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సేగ్గం రాజేష్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానమే తెలంగాణలో ఉండదని చెప్పిన కేసీఆర్ గారు కేవలం మాటల వారకే పరిమితం చేశారు. 2019లో విధుల్లోకి చేర్చుకొని ఇప్పటివరకు కూడా పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేయకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు ఓపియస్ లను రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంథని సత్యం, రావికంటి సతీష్, వేల్పుల రాజు, పెంటరి రాజు,మంథని రాకేష్, ఆర్ల నాగరాజు, దొగగోర్ల శ్రీనివాస్ యాదవ్, ఉట్ల అనిల్ రెడ్డి,పల్లె రవి, కన్నబోయిన ఓదెలు,ఎరుకల రమేష్ బాబు, అక్కపాక సదయ్య, జనగమ సడువలి,మంథని సమ్మయ్య, పోరండ్ల రంజిత్, కెక్కర్ల సందీప్, రితీష్, ఇందారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.




