Tuesday, 3 November 2026

విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడుకాయకమే కైలాసం మహాత్మ బసవేశ్వర ప్రవచనాలు ప్రతి ఒక్కరు ఆచరించాలి 12వ శతాబ్దంలోనే ఆయన గొప్ప సంఘసంస్కర్త  20వ శతాబ్దంలో ఆలోచిస్తున్న ఈ విషయాలు ఆయన 12 శతాబ్దంలోనే వివరించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బసవ భవనానికి భూమి పూజ  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు మరియు ఆర్థిక శాఖ మాత్యులు హరీష్ రావు 

 

 

 

 

 

 

సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఏప్రిల్ 29సంగారెడ్డి జిల్లా, కంది మండలంలో వీర శైవ లింగాయత్ భవన (బసవ భవన్) నిర్మాణానికి శంకస్థాపన చేసిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు. పాల్గొన్న ఎంపి బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, టిఎస్ ఎం ఎస్ ఐ డి సి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్,  సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి కౌన్సిలర్ రామప్ప వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షులు మధుశేఖర్ వీరశైవ లింగాయత్ బందు లింగాయత్ సోదర సోరీమణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాకమే కైలాసం అని బసవేశ్వరుడు గొప్ప మాట చెప్పార నీ,  ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తే, పైకి వస్తారు అని చెప్పాడు. నేను అదే స్పూర్తితో పని చేస్తున్న మంత్రి వివరించారు .  కుల రహిత సమాజం అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నము. కానీ 12 శతాబ్దం లోనే మహాత్మా బసవేశ్వరుడు ఆచరణ చేసి చూపాడు అన్నారు.  అప్పుడే అంత గొప్ప ఆలోచన అంటే, ఆయన దైవ స్వరూపుడు. అంతటి గొప్ప వ్యక్తి గురించి నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు.పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్  అడగగానే ఒప్పుకొని, సీఎం కేసీఆర్  అధికారికంగా బసవ జయంతి నిర్వహిస్తున్నారని, గతంలో ఎవరు ఇలా చేయలేదని గుర్తు చేశారు. లింగాయత్తుల గౌరవాన్ని ఆకాశమంత  ఎత్తుకు తీసుకువెళ్ళింది సీఎం కేసీఆర్ అన్నారు.
బ్రిటిష్ ప్రధాని లండన్ పార్లమెంట్ ఎదురుగా బసవ విగ్రహం పెట్టారని గుర్తుచేశారు.రాబోయే తరాలకు తెలిసేలా పాఠ్య పుస్తకాల్లో కూడా బసవేశ్వరుని గురించి గురించి చేర్చారన్నారులింగాయత్ సమాజానికి తెలంగాణ ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించిం దన్నారు.ఆత్మ గౌరవ భవనాలు కోసం  హైదరాబాదులో కోకాపేటలోని ఎకరా స్థలం 30 కోట్ల విలువ కలిగిన  భూమిని ఇవ్వడంతో పాటుగా రూ.10కోట్ల రూపాయలతో భవన నిర్మాణం చేయబోతున్నా మన్నారు.అత్మభవన గౌరవం మీ పిల్లలు చదివేందుకు, ఐక్యత పెరిగేందుకు, అన్ని సమాజాలకు ఈ భవనం ఉపయోగ పడుతుంది మంత్రి వివరించారు.బసవేశ్వర స్వామి పేరు మీద ఉమ్మడి మెదక్ జిల్లాలో బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టామన్నారు.
కుల, మతాలు ఏవైనా భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న దేశం మన భారత దేశమని, అందరూ కలిసి మెలసి ఉండాలన్న బసవేశ్వరుడి సూక్తులు ఆచరణలో పాటిద్దామని,  ఓబీసీ రిజర్వేషన్ పై ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లింగాయత్ సమాజాన్ని ఓబీసీ లో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని గుర్తుచేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గానీ ఆ పార్టీ నాయకులు గానీ దీన్ని పరిష్కరించేందుకు కృషి చేయాలి అని డిమాండ్ మంత్రి డిమాండ్ చేశారు.
బసవ భవనంకు అవసరమైన నిధులు తప్పకుండా ఇస్తామన్నారు.సమాజంలో వీరశయులు ఎంతో నిజాయతీగా ఉంటారని బవస స్ఫూర్తిని జీవితంలో పాటిస్తారని,  ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకుంటారని కొనియాడారు.నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్  హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, హైదరాబాద్ ఎంతో మారింది అని, న్యూ యార్క్ లాగా ఉంది అన్నరని మంత్రి గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్  అభివృద్ధి బాగా చేశారు అన్నరు. 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ది, తెలంగాణ అభివృద్ధి అందరికీ కనిపిస్తున్నదని, పక్కరాష్ట్రంలో ఉన్న రజినీ గారికి అర్థమైంది, కానీ ఇక్కడే ఉన్న గజినీలకు మాత్రం అర్థం కావడం లేద ఆన్నారు.కేసీఆర్ దించుతం, బి ఆర్ ఎస్ దించుతం అంటున్నరు కాంగ్రెస్ నాయకులు..ఎందుకు దించుతరు అని ఆయన ప్రశ్నించారు.
ఆసరా పింఛన్లు ఇస్తున్నందుకు దించుతరా…
కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇస్తున్నందుకు దించుతరా..
కేసీఆర్ కిట్ కింద పదమూడు వేలు ఇస్తున్నందుకు దించుతరా..
రైతుబంధు కింద పదివేలు ఇస్తున్నందుకు దించుతరా
రైతుబీమా కింద ఐదు లక్షలు ఇస్తున్నందుకు దించుతరా
కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందిస్తున్నందుకు దించుతరా..
ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాకుండా..టీహాబ్, వీహాబ్, టీఎస్ఐపాస్ తో పదిహేడు లక్షల ప్రైవేటు కోలువులు ఇస్తున్నందుకు దించుతరా..
*రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తే, నిరుద్యోగులను రెచ్చ గొట్టే ప్రయత్నం వారు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.దొంగ దీక్షలు చేస్తూ దొంగే దొంగ అన్నట్లు చేస్తున్నారన్నారు.
ప్రస్తుతం సంగారెడ్డిలో కడుతున్న బసవ భవనానికి ముందుగా 50 లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు రాబోయే రోజుల్లో కూడా వీరశైవులందరికీ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని అది గుర్తు చేసుకుని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు.