ఎనుమాముల జనంసాక్షి : ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, సుధారాణిలు డిమాండ్ చేశారు. తెలంగాణ తెలుగుదేశంపార్టీ నేతలు బుధవారం ఉదయం ఎనుమాముల మార్కెట్‌యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారు. పత్తికి రూ. 5వేలు, మిర్చికి రూ.10వేల రూపాయలు మద్ధతు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.




