గౌస్వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 26 జనం సాక్షివికారాబాద్ నవాబుపేట ప్రధాన రోడ్డు పనులు సంవత్సరాలు గడుస్తున్న పూర్తి కాకపోవడంతో ప్రజలు ప్రయాణికులు వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు రోడ్డు పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం అధికారుల వైఫల్యం నచ్చని అడగను సాగుతున్నాయని పలువురు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నారు ఈ రోడ్డు గుండప్రయాణించాలంటే వర్షం పడితే బురద మయం ఎండలు కొడితే దుమ్ముదులి తో ప్రజలందరూ నానా అవస్థలు గురవుతున్నారు జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న నవాబుపేటకు వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కాంట్రాక్టర్లు అధికారుల వైఫల్యం వల్లే పనులు త్వరగా జరగక పోవడం కారణమని పలువురు విమర్శిస్తున్నారు ఈ నియోజకవర్గానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రాధాన్యత వస్తున్నారు తన సొంత నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే మిగతా మండలాల్లో ఎలా ఉంటుందో స్పష్టంగా అర్థం అవుతుంది రోడ్డు భవనాల శాఖ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన వెంటనే స్పందించి వికారాబాద్ నవాబుపేట రోడ్డు పనులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు…?
…సయ్యద్ గౌస్ మండల కో ఆప్షన్ సభ్యుడు
వికారాబాద్ నవాబ్ పేట రోడ్డు నిర్మాణ పనులు త్వరగా జరగకపోవడానికి అధికార వైఫల్యమే కారణమని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నవాబుపేట నుండి వికారాబాద్ రోడ్డు వరకు త్వరగా పనులు పూర్తి చేసి రోడ్డును అందుబాటులోకి తేవాలని ఆయన అధికారులను సూచించారు




