Thursday, 5 November 2026

పంటల నష్టపరిహారం వెంటనే చెల్లించాలి వైయస్సార్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పరి ప్రసాద్

వికారాబాద్ రూరల్ మార్చి 17 జనం సాక్షి
వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని వికారాబాద్ నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంచార్జ్ ఉప్పరి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం మర్పల్లి మండలం కొట్లాపూర్ గ్రామంలో నిన్న వడగండ్ల వాన పడడంతో సుమారుగా 50 ఎకరాల చేతికి వచ్చిన పంట నష్టపోవడం జరిగింది అటు నష్టపోయిన రైతులను వారి పొలాల దగ్గరికి వెళ్లి నష్టపోయిన పంటలను పరిశీలించి ఎకరాకు మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతులందరికీ వైయస్సార్ తెలంగాణ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పరి ప్రసాద్ రైతులను పరామర్శించారు మర్పల్లి మండలం కోట్లపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన వడగళ్ల వాళ్ళు నష్టపోయిన పంటలు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు పండుగ జరిగేది మొట్టమొదటిగా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ఆర్ కి దక్కింది తిరిగి మళ్లీ రైతులకు పండుగ జరగాలంటే వైయస్సార్ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తే ఇన్పుట్ సబ్సిడీ గిట్టుబాటు ధర కలగ చేస్తామని రైతులకు అవగాహన కలిగిస్తూ పంట నష్టపరిహారం కింద మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే 50 ఎకరాల పంట నష్టపడి రైతులు విలవిలాడుతున్న ఇంకా వీళ్ళని పరామర్శించక ఎమ్మెల్యే నిద్రపోవడం చూస్తుంటే ఎంతో బాధపడమన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు