Monday, 2 November 2026

పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 30 వేలు నష్టపరిహారం అందించాలివైయస్సార్ టి పి. అధ్యక్షురాలు షర్మిల

 

 

 

 

 

బచ్చన్నపేట ఏప్రిల్ 29 (జనం సాక్షి) వడగండ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి 30 వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బచ్చన్నపేట మండలంలోని ఆలింపురం. నాగిరెడ్డిపల్లి గ్రామాలలో నష్టపోయిన రైతు పంట పొలాలను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ. జనగామ జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలయిందని రైతులు పంటలను నమ్ముకుని సర్వం కోల్పోయారని అన్నారు. ఒక బచ్చన్నపేట మండలంలో నే పదివేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తుందన్నారు. ఇంత నష్టం జరిగి రైతులు కన్నీరు పెట్టుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క ఎకరానికి కూడా నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని . ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ఇస్తానన్న వాళ్లు ఇంతవరకు నెల రోజులు దాటినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాలంలో వ్యవసాయం పండుగలా ఉండేదని అన్నారు. ఎకరానికి 30 వేల రూపాయలు పంటకు పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతుకు ఎకరానికి 5000 రూపాయలు ఇస్తే ఎలా సరిపోతుందని రాష్ట్రంలో 23 జిల్లాల్లో పంట నష్టం జరిగిందని . పంట బీమా అసలే లేదని. కిసాన్ సర్కార్ అంటే ఇదేనా అని అన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు క్రాఫ్ లోనూ రైతు బీమా పంట నష్టపరిహారం ఇచ్చే విధంగా చూసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు