Monday, 2 November 2026

పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 30 వేలు నష్టపరిహారం అందించాలి

 

 

 

 

 

 

జహీరాబాద్  ఏప్రిల్ 30  (జనం సాక్షి) వడగండ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి 30 వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ జోనా నరేష్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం  మండలంలోని  వివిధ  గ్రామాలలో రైతులు పండించిన మొక్క జొన్న, పొప్పాయి,టమోటో  పంట పొలాలను పరిశీలించిన అనంతరం ఆయన  మాట్లాడుతూ చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలయిందని రైతులు పంటలను నమ్ముకుని సర్వం కోల్పోయారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క ఎకరానికి కూడా నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని . ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ఇస్తానన్న వాళ్లు ఇంతవరకు నెల రోజులు దాటినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాలంలో వ్యవసాయం పండుగలా ఉండేదని అన్నారు. ఎకరానికి 30 వేల రూపాయలు పంటకు పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతుకు ఎకరానికి 5000 రూపాయలు ఇస్తే ఎలా సరిపోతుందని అన్నారు. కిసాన్ సర్కార్ అంటే ఇదేనా అని అన్నారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు క్రాఫ్ లోనూ రైతు బీమా పంట నష్టపరిహారం ఇచ్చే విధంగా చూసుకుంటామని  రైతులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ టి పి నాయకులు మోజెస్ సూర్యకాంత్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.