జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని పోచమ్మ వాడ, మంథని మండలం కన్నాల గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. వడ్లను తూర్పాల పడితేనే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని షరతులు విధించకుండా కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధికార ప్రతినిధి తొకల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.




