Thursday, 5 November 2026

వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ నేల దినోత్సవం

వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ నేల దినోత్సవం

జూలూరుపాడు, డిసెంబర్ 5, జనంసాక్షి: మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా సోమవారం పలు కార్యక్రమాలను నాలుగు క్లస్టర్లలో ఘనంగా నిర్వహించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి పర్యావరణాన్ని కాపాడుతూ పొలాల్లో ఉండే పంటకు అవసరమైన మిత్ర పురుగులు ఉదాహరణకు వానపాములు, పిచుకలు వంటి వాటిని కాపాడుతూ భావితరాలకు సారవంతమైన నేలను అందించాలని ఈ సందర్భంగా ఏవో రఘు దీపిక రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకర్ల వ్యవసాయ విస్తరణ అధికారి లావణ్య,
కాకర్ల ఎంపీటీసీ పొన్నేకంటి సతీష్, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు యదళ్ళపల్లి వీరభద్రం, మాచినేనిపేట వ్యవసాయ విస్తరణ అధికారి గోపికృష్ణ, జూలూరుపాడు వ్యవసాయ విస్తరణ అధికారి గౌస్, పాపకొల్లు వ్యవసాయ విస్తరణ అధికారి ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.