– ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని పంచుకున్న షోయాబ్‌మాలిక్
హైదరాబాద్, అక్టోబర్30(జనంసాక్షి) : భారత టెన్నిస్ స్టార్ సానియా విూర్జా హైదరాబాద్‌లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం ఆమె భర్త, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొడుకు పుట్టడంతో ఉబ్బితబ్బిబయిన షోయబ్.. సానియా ఆరోగ్యం కూడా బాగుందని తెలిపాడు. విూ విషెస్‌కు ధన్యవాదాలు అంటూ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. సానియా తల్లయిన విషయాన్ని ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. సానియా దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సోయబ్ మాలిక్ మేనేజర్ అవిూన్ హక్ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. తల్లిబిడ్డ చిరునవ్వులు చిందిస్తున్నారని తెలిపాడు. తొలిసారి తండ్రి కావడంతో మాలిక్ ఆనందంతో ఉన్నాడని చెప్పాడు. సానియా-షోయబ్ 2010లో పెళ్లాడారు. తాను గర్భం దాల్చిన విషయాన్ని సానియా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ అందమైన ట్వీట్ ద్వారా తెలిపారు. గర్భవతి కావడంతో కొంత కాలంగా ఆటకు దూరంగా ఉన్న హైదరాబాదీ టెన్నిస్ స్టార్.. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధం కానుంది.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన.. సానియా విూర్జా




