Thursday, 5 November 2026

పగిలిన పైప్ లైన్.దండేపల్లి మండలం గూడెం లిఫ్ట్ పైప్ లైన్

పగిలిన పైప్ లైన్.దండేపల్లి మండలం గూడెం లిఫ్ట్ పైప్ లైన్ నిన్న సాయంత్రం పగలడంతో ఈరోజు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పైప్ పగిలిన ప్రాంతాన్ని మండల బిజెపి నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఎమ్మెల్యే దివాకర్ రావు చేతగాని తనం వల్లనే తరచూ గూడెం లిఫ్ట్ మరమ్మత్తులు జరగడంలేదని 2021 మార్చ్ లో మంత్రి హరీష్ రావు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా గూడెం లిఫ్ట్ జిఆర్పి పైపులను ఎంఎస్ పైపులుగా మారుస్తామని హామీ ఇచ్చి రెండు ఎండ్లు గడిచిన ఇప్పటి వరకు పనులు కూడా ప్రారంభించకుండ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, తక్షణమే గూడెం లిఫ్ట్ మరమ్మతులు పూర్తి చేసి కడెం కాలువ మరియు గూడెం లిఫ్ట్ ద్వారా మంచిర్యాల అసెంబ్లీలో ఉన్న పంటలకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని డిమాండ్ చేశారు.