Wednesday, 4 November 2026

పటాకులకు 2గంటలే పర్మిషన్‌: దానకిషోర్‌

హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే అంశంపై నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా దీపావళి టపాసులను రెండు గంటలే కాల్చాలన్నారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపే టపాసులు కాల్చాలన్నారు. రాష్ట్ర కాలుష్య మండలి నిర్ధేశిరచిన పొగ, శబ్ద పరిమితులు పాటించాలన్నారు. అలాగే సుప్రీంకోర్టు నిబంధనలు కూడా తప్పక పాటించాలని దానకిషోర్‌ తెలిపారు.