వరంగల్ ఈస్ట్, జూన్ 1 (జనం సాక్షి)ఓ వ్యక్తి పోగొట్టుకున్న పర్సన్ నిజాయితీగా కొందరు అప్పగించిన సంఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వేములవాడ సిరిసిల్ల జిల్లాకు చెందిన చిలువేరు శ్రవణ్ కుమార్ హంటర్ రోడ్ లోని ఓ ఫంక్షన్ హాల్ కు పెళ్లికి హాజరవ్వడానికి తన కారులో వచ్చాడు. అయితే కారు పార్కింగ్ చేసే దిగుతుండగా పర్స్ కింద పడిపోయింది. అదే అతను చూసుకోలేదు. అయితే అక్కడే ఉన్న వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతానికి చెందిన అనుముల నరేష్, గుమ్మడి దాసులు గమనించి ఆ పర్సును తీసుకుని ఎంక్వయిరీ చేసే ప్రయత్నంలో తన వాహన నెంబర్ ను రిజిస్ట్రేషన్ బట్టి ఫోన్ నెంబర్ తెలుసుకోవడంతోపాటు అతనికి ఫోన్ చేసి పర్సు తీసుకొని వెళ్లాల్సిందిగా కోరారు. అయితే అక్కడికి సమీపంలో ఉన్న వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబూలాల్ చేతుల మీదుగా ఆ పర్సు ను సంబంధిత వ్యక్తి అయినా శ్రవణ్ కుమార్ కు ఇప్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ బాబూలాల్ మాట్లాడుతూ నిజాయితీగా పోగొట్టుకున్న పర్సును ఇచ్చినటువంటి గుమ్మడి దాస్ నరేష్ లను అభినందించారు. అయితే శ్రవణ్ కుమార్ పోగొట్టుకున్న పర్సులో 400 రూపాయల నగదు తో పాటు హెచ్ డి ఎఫ్ సి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు అలాగే పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు పొల్యూషన్ సర్టిఫికెట్ మొదలైనవి ఉన్నాయి
పోగొట్టుకున్న పర్సు అప్పగింత




