Wednesday, 4 November 2026

రైతు కళ్ళల్లో కన్నీళ్లు-రైతు చేతులకు సంకెళ్లు- మహమ్మద్ రఫీ ఉద్దీన్ గౌరీటిపిసిసి మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి

భువనగిరి టౌన్ జనం సాక్షి):–రైతు కళ్ళల్లో కన్నీళ్లు-రైతు చేతులకు సంకెళ్లు* ఈ పరిస్థితి భువనగిరి రాయగిరి ఇంకా మిగిలిన థ్రిబుల్ ఆర్ రోడ్డు లో భూములు కోల్పోయినరైతుల పరిస్థితి.ఈ పరిస్థితి చుస్తే కన్నీరు వస్తుందని టీపీసీసీ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ ఉద్దీన్ గౌరీ.అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.1.గవర్నమెంట్ భూములు తీసుకోకుండా పేద రైతుల భూములు గుంజుకోవడం చాలా బాధాకరమన్నారు.2.కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను అరెస్ట్ చేసి కేసులు పెట్టడం కేసీఆర్ నిరంకుశపాలనకు నిదర్శనమని అన్నారు.3.ఈ ఆరెస్ట్ చేసిన రైతులను కోర్టుకు తీసుకొని వచ్చే క్రమంలో వారి చేతులకు సంకెళ్లు ఉండటం కన్నీరు పెట్టించే పరిస్థితి నెలకొందని అన్నారు.4.తెలంగాణ రాష్ట్రంలో రైతులకు న్యాయం చేస్తున్న అని చెప్పిన కెసిఆర్ దీనికి ఏ సమాధానం చెపుతారని మండిపడ్డరు.5.నాలుగు దఫాలుగా భూములు ఇస్తూనే ఉన్న కొద్ది భూమిని గుంజుకోవడం చాలా బాధాకరమని అన్నారు.6.రైతుల కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.7.అలాగే వారి డిమాండ్లు ను ప్రభుత్వం నెరవేర్చలని మహమ్మద్ రఫీ ఉద్దీన్ గౌరీ కోరారు.