హుజూర్ నగర్ జూన్ 2 (జనంసాక్షి): తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర, స్వపరిపాలన దశాబ్దాల కలను అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సారథ్యంలో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ పటిష్టమైన ప్రణాళికలతో అనేకమంది అమరవీరుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దశాబ్ద కాలంలోనే శతాబ్ద కాల అభివృద్ధిని సాధించి దేశానికే ఒక చుక్కానిగా మారిన తరణంలో రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి క్యాంపు కార్యాలయం నందు హుజూర్ నగర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ పతాకం, తెలంగాణ భారత రాష్ట్ర సమితి జెండాలను ఆవిష్కరించుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం హుజూర్ నగర్ పాత బస్టాండ్ దగ్గరలో గల అమరవీరుల స్తూపం వద్దకు భారీగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుని పూలమాలలు సమర్పించి, ముక్తకంఠంతో అమరవీరుల త్యాగాలను నినదీస్తూ అమరవీరులకు ఘనంగా ఘన నివాళిని అర్పించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ వేల సంఖ్యలో అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రమని, విజన్ ఉన్న నాయకుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అమరవీరుల ప్రాణ త్యాగ బలిదానాలకు సాక్షిగా వారి ఆశయాలను నెరవేరుస్తూ పక్కా ప్రణాళికతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలోనే అగ్ర స్థానంలో నిలబెట్టి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకునేలా ముందుకు సాగుతుందని. నేడు బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుని స్వరాష్ట్రంలో అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారని, మరొకసారి ప్రతిపక్షాలకు బుద్ధి చెబుతూ భారత రాష్ట్ర సమితి రాబోయే ఎన్నికలలో 100కు పైగా సీట్లను సాధించి అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజా అభీష్ట సుపరిపాలనను సుస్థిరం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనరవి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కె ఎల్ ఎన్ రెడ్డి (డాక్టర్), మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు అట్లూరి హరిబాబు, గోల్డ్ పిచ్చయ్య, కౌన్సిలర్లు కొమ్ము శ్రీను, జక్కుల శంభయ్య, ఓరుగంటి నాగేశ్వరరావు, దొంగరి మంగమ్మవీరారెడ్డి, చిలకపత్తిని సౌజన్యధనుంజయ్, అట్లూరి మంజులహరిబాబు, వీర్లపాటి గాయత్రిభాస్కర్, ఎండి అస్మానజీర్, ఎరగని గురవయ్య, అమరబోయిన గంగరాజు, మాజీ కౌన్సిలర్ మీసాల కిరణ్ కుమార్, వార్డు ఇన్చార్జులు ఇట్టి మల్ల సువార్త మధు, భూక్య చంద్రమౌళి, కర్ణ నాగరాజు, పట్టణ యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, వార్డు అధ్యక్షులు రాగి శ్రీనివాస చారి, తండు సాయిరాం గౌడ్, శీలం సైదులు, శీలం వీరయ్య, ఉపతల బుచ్చయ్య, పాలడుగు రాజు, కోలిపాక వెంకటేశ్వర్లు, మేరీగ గురవయ్య, ముంజంపల్లి నాగరాజు, తురక వీరబాబు, ఎల్లావుల రాము, పెద్ది పుష్ప, ఆవులు గురువయ్య, మలిదశ ఉద్యమకారులు ఎడ్ల విజయ్, చెవుల కవిత, యువజన నాయకులు సోమపొంగు రవీంద్ర, మెరిగ సాయి, జనగ వినయ్ యాదవ్, సతీష్, జక్కుల కృష్ణ, మహిళా నాయకురాల్లు గూడేపు దీప, షేక్. రహిమ, జక్కుల అర్చన, చిట్టిప్రోలు స్వప్న, మామిడి మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు – అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితం తెలంగాణ రాష్టం




