Thursday, 5 November 2026

యువతను చైతన్య వంతులను చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద

యువతను చైతన్య వంతులను చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద హుజూర్ నగర్ జనవరి 12 (జనం సాక్షి): యువతను చైతన్య వంతులను చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని హుజూర్ నగర్ బిజెపి పట్టణ అధ్యక్షుడు ఇంటి రవి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి ఆదేశానుసారం గురువారం బిజెపి పార్టీ కార్యాలయంలో ఇంటి రవి అధ్వర్యంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూల మాలవేసి, స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ శక్తి అణు శక్తి కంటే బలమైనదని,
యువజన చైతన్యమే లక్ష్యంగా, యువత భాగస్వామ్యాన్ని దేశ అభివృద్ధికి బాటలు వేసేలా, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దేశ విదేశాలలో చాటిచెప్పి యువతలో ఆత్మ విశ్వాసం, పట్టుదల, దృఢ సంకల్పం పై రచనలు, ప్రసంగాలతో చైతన్య వంతులను చేసిన మహోన్నత వ్యక్తి స్వామీ వివేకానంద అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షుడు అంబళ్ల నరేష్ గౌడ్, పట్టణ నాయకులు గుండా గోపి, కొల్లూరు నాగేంద్ర చారి, దేవి శెట్టి మురళి, లింగం ఎల్లయ్య, ఎలకాని సాయి కృష్ణ, గోపి, శ్రీనివాస్, సోను కృష్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.